గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jan 25 , 2026 | 08:03 PM
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలియజేశారు.
హైదరాబాద్: దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారత దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ దేశ ప్రజలందరికీ పండుగ వంటిదని పేర్కొన్నారు (Telangana Chief Minister Republic Day message). జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సోమవారం నాడు రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సహా ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న ముగ్గురిని 10 సెకెన్లలో కనిపెట్టండి..
వార్నీ.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. గోధుమలను ఎలా ఆరబెడుతోందో చూడండి..