కోనసీమలో టెన్షన్ టెన్షన్.. ఆరని బ్లోఅవుట్
ABN, Publish Date - Jan 06 , 2026 | 01:11 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. స్థానికులను ఖాళీ చేయించిన అధికారులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రెండో రోజు కూడా బ్లోఅవుట్ కొనసాగుతోంది. పీడనం తగ్గితేనే మంటలు పూర్తిగా ఆర్పే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం, ఇరుసమండ గ్రామంలో ONGC గ్యాస్ బావి నుంచి భారీ గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగడం వల్ల హై టెన్షన్ నెలకొంది. స్థానిక ప్రజలను ఖాళీ చేయించి, అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రెండవ రోజు కూడా బ్లోఅవుట్ కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మంటలు కొంచెం తగ్గాయి. పీడనం తగ్గితే తప్ప మంటలు అదుపులోకి రావని నిపుణులు చెబుతున్నారు.
ఇవి చదవండి
ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు చర్యలు: పొన్నం
Updated at - Jan 06 , 2026 | 05:20 PM