మళ్లీ చిన్ని వర్సెస్ కొలికపూడి..
ABN, Publish Date - Mar 03 , 2026 | 08:26 AM
టీడీపీ అధిష్థానం జోక్యం చేసుకున్నా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో వారిద్దరి మధ్య ప్రొటోకాల్ చిచ్చు ఏర్పడింది.
విజయవాడ, మార్చి 03: టీడీపీ అధిష్ఠానం జోక్యం చేసుకున్నా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో వారిద్దరి మధ్య ప్రొటోకాల్ చిచ్చు ఏర్పడింది. ఎంపీ చిన్నికి దేవస్థాన పురోహితులు అందజేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడంతో వివాదం చెలరేగింది. స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు చిన్ని దంపతులకు అర్చకులు అందజేశారు. అయితే తనకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కొలికపూడి చేతులు చాచారు. దీంతో పురోహితులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
Updated at - Mar 03 , 2026 | 08:57 AM