గొర్రెల కాపరిగా మారిన బాలుడు.. స్పందించిన లోకేశ్
ABN, Publish Date - Oct 01 , 2026 | 03:31 PM
ప్రకాశం జిల్లా రాచువారిపాలెంలో బాలుడి దయనీయ స్థితిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గొర్రెల కాపరిగా మారిన బాలుడిని చూసి తన హృదయం కలిచివేసిందన్నారు.
అమరావతి, అక్టోబర్ 1: ప్రకాశం జిల్లా రాచువారిపాలెంలో రామయ్య అనే బాలుడి దయనీయ స్థితిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గొర్రెల కాపరిగా మారిన బాలుడిని చూసి తన హృదయం కలిచివేసిందన్నారు. బడిలో ఉండాల్సిన పిల్లాడు దయనీయ స్థితిలో ఉండటం బాధాకరమన్నారు. రామయ్య ఎక్కడున్నా సురక్షితంగా తీసుకొచ్చి చదివించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాలుడి కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి తీసుకొచ్చిన వారికి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలియజేశారు.
Updated at - Oct 01 , 2026 | 03:37 PM