తండ్రికి నివాళులర్పించిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Jan 18 , 2026 | 11:43 AM
నేడు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కుమార్తె నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
హైదరాబాద్, జనవరి18: దివంగత నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా.. ఆయన కుమార్తె నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరితో పాటు తన తండ్రి ఎన్టీఆర్‌కు పుష్పగుచ్ఛం సమర్పించి.. ఆయన సేవలను స్మరించుకున్నారు. తండ్రి ఆశయాలను, సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రగామిగా, రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడరం పర్యటన ముగించుకుని విదేశాలకు సీఎం..
మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
Updated at - Jan 18 , 2026 | 01:29 PM