కుక్కపిల్లను ఒడిలో పడుకోబెట్టుకుని లాలించిన కోతి
ABN, Publish Date - Mar 14 , 2026 | 05:20 PM
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్ నగర్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వానరం జాతి వైరాన్ని మరిచి కుక్క పిల్లలను అక్కున చేర్చుకుంది.
పెద్దపల్లి జిల్లా, మార్చి 14: గోదావరిఖని హనుమాన్ నగర్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వానరం జాతి వైరాన్ని మరిచి కుక్క పిల్లలను అక్కున చేర్చుకుంది. కుక్కపిల్లలను తన ఒడిలో పడుకోబెట్టుకుని కోతి లాలించింది. ఈ ఘటన చూపరులను ఆకట్టుకుంది. కన్న పిల్లలను చూసుకున్నట్లు ఎంతో జాగ్రత్తగా ఆ కుక్క పిల్లలను వానరం చూసుకుంది. ఎండ వేడి నుంచి ఆ కుక్కపిల్లలను కాపాడేందుకు.. కోతి అడ్డుగా నిలపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
Updated at - Mar 14 , 2026 | 05:32 PM