నందిగామ హైవేపై ట్రాఫిక్ జామ్..

ABN, Publish Date - Jan 11 , 2026 | 04:22 PM

ఇవాళ(ఆదివారం) ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద వై-జంక్షన్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో రద్దీ ఏర్పడింది.

ఎన్టీఆర్ జిల్లా, జనవరి 11: సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. వాహనాల రద్దీతో ఇవాళ(ఆదివారం) ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వై-జంక్షన్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హైవే సర్వీస్‌ రోడ్డుపై గుంతల కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో ఈ జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలతో నందిగామ వై-జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో కీసర టోల్ ప్లాజా కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజులపాటు హైవేపై వాహనాల రద్దీ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ కూరగాయలు తింటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు..

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

Updated at - Jan 11 , 2026 | 04:34 PM