ఇంటర్ అమ్మాయిపై అత్యాచారం చేసిన ఇంటి ఓనర్
ABN, Publish Date - Mar 21 , 2026 | 06:46 AM
మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్‌పై ఇంటి యజమాని లైంగిక దాడి చేశాడు. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటున్నారు.
మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్‌పై ఇంటి యజమాని లైంగిక దాడి చేశాడు. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటున్నారు. వాళ్ళకు ఇంటర్మీడియట్ చదివే కూతురు ఉంది. రఘు కొంత కాలంగా బాలికను బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలిక పరిస్థితి చూసి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకువెళ్లగా గర్భవతి అని తేలింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి..
ఇవి కూడా చూడండి:
కొడుకా..ఇదేం న్యాయం..? జగన్ కి విజయమ్మ సంచలన లేఖ
బాసర ట్రిపుల్ ఐటీ లో హై టెన్షన్.. తేజస్విని కుటుంబ సభ్యుల ఆందోళన
Updated at - Mar 21 , 2026 | 06:46 AM