కూటమి మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర..

ABN, Publish Date - May 08 , 2026 | 07:33 AM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్ ఆరోపించారు. ఫేక్ ఆడియో కాల్స్‌తో కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్ ఆరోపించారు. ఫేక్ ఆడియో కాల్స్‌తో కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంపీ బాలశౌరిని తాను తిట్టినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్ ఆడియో తిప్పుతున్నారని వైసీపీపై దిలీప్ కుమార్ ఆగ్రహించారు. తన వ్యక్తిగత ఫోన్ సంభాషణను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

మళ్లీ అవే సమాధానాలు

పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

Updated at - May 08 , 2026 | 07:36 AM