ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి?

ABN, Publish Date - Aug 27 , 2026 | 10:23 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 1న విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 1న విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌ పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఆయన తిరిగొచ్చిన అనంతరం అధికార యంత్రాంగంలో మార్పులతో పాటు గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Updated at - Aug 27 , 2026 | 10:23 AM