తాడిపత్రి మున్సిపల్ వీడ్కోలు సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న జేసీ

ABN, Publish Date - Mar 17 , 2026 | 09:40 PM

తాడిపత్రి మున్సిపాలిటీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కదిలించింది.

అనంతపురం, మార్చి 17: తాడిపత్రి మున్సిపాలిటీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్ధిపై తనకు స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. 2027 నాటికి ప్రపంచ పటంలో తాడిపత్రి పేరు కనిపించేలా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలతో మాట్లాడిన ఆయన, తాను తప్పు చేస్తే చెప్పాలని, తప్పులను సరిదిద్దుకుంటామని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.

Updated at - Mar 17 , 2026 | 09:42 PM