ఎలక్ట్రానిక్ పరికరంలో మంటలు.. ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

ABN, Publish Date - May 05 , 2026 | 08:56 PM

హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం విమానం చండీగఢ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్, మే 5: హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం విమానం చండీగఢ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇండిగో విమానం 6E 108 రన్‌వేపై ల్యాండ్ అయి నిలిచి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించిన క్యాబిన్ సిబ్బంది తక్షణమే స్పందించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే ప్రయాణికులందరినీ విమానం నుంచి ఖాళీ చేయించి టెర్మినల్‌కు సురక్షితంగా తరలించారు.


ఇవి చదవండి

బుమ్రా పేలవ ప్రదర్శనకు వర్క్‌లోడ్ కారణం: రవి శాస్త్రి

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్

Updated at - May 05 , 2026 | 09:00 PM