చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి అనిత సమీక్ష
ABN, Publish Date - Apr 19 , 2026 | 11:33 AM
సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామి వారి చందనోత్సవం కోసం జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 19: సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామి వారి చందనోత్సవం కోసం జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ చందనోత్సవం కోసం లక్షలాది మంది భక్తులు సింహాచలం తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులు, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. అంతకుముందు సింహాద్రి అప్పన్న స్వామిని హోం మంత్రి అనిత దర్శించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేశ భవిష్యత్తు మార్చనున్న ఏపీ..క్వాంటం వ్యాలీ కొత్త రికార్డు
అమెరికా మాట తప్పింది..హోర్ముజ్ ను మూసేస్తున్నాం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 19 , 2026 | 11:46 AM