భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ABN, Publish Date - Jun 27 , 2026 | 08:39 AM
తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
వెనుజువెలాలో మరోసారి భూ ప్రకంపనలు..
చైనా రాజధాని బీజింగ్‌లో విమాన ప్రమాదం.. ముక్కలై కిందపడిపోయిన విమానం..
Updated at - Jun 27 , 2026 | 08:41 AM