మద్యం మత్తులో పాముతో పోలీసులను బెదిరించిన ఆటో డ్రైవర్

ABN, Publish Date - Jan 04 , 2026 | 01:51 PM

చంద్రాయణగుట్టలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆటోను ఆపారు. అతడు మందు తాగాడని గుర్తించి కిందకు దింపారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు.

మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. పోలీసులను పాముతో బెదిరించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖీలు నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చంద్రాయణగుట్టలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆటోను ఆపారు. అతడు మందు తాగాడని గుర్తించి కిందకు దింపారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. తన దగ్గర ఉన్న పాముతో పోలీసులపై బెదిరింపులకు దిగాడు. పాముతో భయపెట్టి పోలీసులను అటు, ఇటు పరిగెత్తించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి చదవండి

హైదరాబాద్‌-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభం

రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అసత్యం..

Updated at - Jan 04 , 2026 | 01:51 PM