జగన్‌కు గర్వం తగ్గిందా..? వైసీపీ నేతలో మార్పు .!!
ABN, Publish Date - Feb 13 , 2026 | 10:16 AM
అధికారంలో ఉన్నప్పుడు అహకారంతో విర్రవీగి.. పార్టీ ప్రజాప్రతినిధుల పట్ల కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు దిగొస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
గెలుపులో గర్వం, ఓటమిలో మూర్ఖత్వం పనికిరావంటారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ విషయంలో మొదటిది వర్తిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అహకారంతో విర్రవీగి.. పార్టీ ప్రజాప్రతినిధుల పట్ల కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు దిగొస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓ ఎంపీ విషయంలో జగన్ వ్యవహరించిన తీరే ప్రత్యక్ష ఉదాహరణగా భావిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు జగన్ ఆ నేత వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రెండు చేతులు జోడించి ఎదురెళ్లినా కనీసం ముఖం కూడ చూడలేదు. తర్వాత ఆ ఎంపీ పార్టీ మారారు. టీడీపీ ఎంపీ అయ్యారు. ఇటీవల ఎదురుపడ్డపుడు వైఎస్ జగన్ ఆ ఎంపీ చేతిలో చెయ్యి వేసి మాట్లాడారు.
ఇవి చదవండి
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారు?
Updated at - Feb 13 , 2026 | 10:49 AM