పార్లమెంట్‌ ఆవరణలో ఆసక్తికర ఘటన.. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఘన స్వాగతం

ABN, Publish Date - Jul 27 , 2026 | 04:45 PM

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్, ఇవాళ‌ తొలిసారి పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్డీయే మిత్రపక్షాల నుంచి అనూహ్య రీతిలో ఘన స్వాగతం లభించింది.

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్, ఇవాళ‌ తొలిసారి పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్డీయే మిత్రపక్షాల నుంచి అనూహ్య రీతిలో ఘన స్వాగతం లభించింది. మరోవైపు విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం జరిగిందంటూ విపక్షాలు పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసనకు దిగాయి. దీంతో పార్లమెంట్‌లో భిన్నమైన వాతావరణం కనిపించింది. ఇవాళ‌ ఉదయం ప్రధాన్ పార్లమెంట్ ప్రాంగణంలోకి రాగానే.. మకార్ ద్వార్ వద్ద గుమిగూడిన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు 'ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. ఆయనను గౌరవసూచకంగా లోపలికి తీసుకెళ్లి, సంప్రదాయ టోపీని బహూకరించారు. ఈ క్లిష్ట సమయంలో తమ నేతకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నామని అధికార కూటమి ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది.


ఇవి చదవండి

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

పెళ్లిలో ఊహించని పరిణామం.. మొదటి భార్య ఎంట్రీతో..

Updated at - Jul 27 , 2026 | 04:46 PM