ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఏసీ పేలి ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి!
ABN, Publish Date - May 03 , 2026 | 09:33 AM
దేశ రాజధానిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక ఐదంతస్తుల భవనంలో ఏసీ కంప్రెషర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు.
న్యూఢిల్లీ, మే 3: దేశ రాజధానిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో గల ఒక ఐదంతస్తుల భవనంలో ఏసీ (Air Conditioner) కంప్రెషర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ మంటలు చెలరేగాయి. వేసవి తాపానికి ఏసీని నిరంతరాయంగా వాడటం వల్ల కంప్రెషర్ వేడెక్కి పేలిపోయింది. ఆ వెంటనే భవనంలోని గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించాయి. భవనంలో సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల పొగ బయటకు వెళ్లలేదు. దీంతో కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల వల్ల ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 14 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 15 మందిని ప్రాణాలతో రక్షించగలిగారు.
Updated at - May 03 , 2026 | 09:39 AM