యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
ABN, Publish Date - Nov 20 , 2026 | 05:06 PM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతోపాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతోపాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (నవంబర్20) ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా, యమకేశ్వర్ బ్లాక్ పంచూర్లో ఆమె తుదిశ్వాస విడిచారు.
తల్లి మరణ వార్తను యోగి ఆదిత్యనాథ్ సోదరుడు మహేంద్ర ధృవీకరించారు. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రికి వెళ్లి తల్లిని పరామర్శించిన సంగతి తెలిసిందే. సావిత్రి దేవి కన్నుమూయడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Updated at - Nov 20 , 2026 | 05:08 PM