డీఎంకే, కాంగ్రెస్ పార్టీలపై సీఎం చంద్రబాబు ఫైర్..
ABN, Publish Date - Apr 21 , 2026 | 09:15 AM
తమిళనాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం నాడు కోయంబత్తూరులో వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ఆయన సమావేశం అయ్యారు.
చెన్నై: తమిళనాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం నాడు కోయంబత్తూరులో వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు ద్రోహం చేశాయని ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్లు రాకుండా ఆ పార్టీలు అడ్డుకున్నాయని మండిపడ్డారు. రాజకీయ ఎజెండాతోనే ఇలా చేశాయని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నిర్ణయం తీసుకుంటే డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు నిరుగార్చాయని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బతో ముగ్గురి మృతి
జగన్ మహిళా 'పక్ష'పాతి కాదు 'కక్ష'పాతి?
Updated at - Apr 21 , 2026 | 09:15 AM