‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ
ABN, Publish Date - Jul 25 , 2026 | 01:28 PM
ఇటీవల తాను చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలను వక్రీకరించారని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. కాక్రోచ్‌లు పరాన్నజీవులు అంటూ యువత, మీడియా, ఆర్టీఐ కార్యకర్తలపై వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వస్తున్న వేళ సీజేఐ క్లారిటీ ఇచ్చారు.
న్యూఢిల్లీ, జులై 25: ఇటీవల తాను చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలను వక్రీకరించారని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. కాక్రోచ్‌లు పరాన్నజీవులు అంటూ యువత, మీడియా, ఆర్టీఐ కార్యకర్తలపై వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వస్తున్న వేళ సీజేఐ క్లారిటీ ఇచ్చారు. తాను దేశ యువతను ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించలేదని, నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి ప్రవేశించిన వారినే ఉద్దేశించి వ్యాఖ్యానించానని స్పష్టం చేశారు. కానీ తన మాటలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చారు.
Updated at - Jul 25 , 2026 | 01:42 PM