కోట్లాది మంది మహిళలకు ద్రోహం

ABN, Publish Date - Apr 18 , 2026 | 10:41 AM

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 2/3 వంతు మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆగిపోవడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళా సాధికారత దిశగా భారతదేశం వేయాల్సిన చారిత్రక అడుగును అడ్డుకున్నాయని అన్నారు. సమాన గొంతుక సరైన ప్రాతినిధ్యం కోరుకుంటున్న కోట్లాది మంది భారతీయ మహిళలకు విపక్షాలు ద్రోహం చేశాయని ‘ఎక్స్’ లో ఆరోపించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు..

Updated at - Apr 18 , 2026 | 10:56 AM