చేపలు కొని.. వంట చేసి.. మత్స్యకారుల కుటుంబంతో చంద్రబాబు భోజనం

ABN, Publish Date - May 20 , 2026 | 09:08 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో చేపలు కొని, వారింటికి తీసుకెళ్లి, వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు.

నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుని తానంగారి బాబు అనే వ్యక్తి తన నివాసానికి భోజనానికి ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు మార్కెట్ నుంచి చేపలను కొనుగోలు చేసి అతని ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ వెంకటమ్మతో కలిసి చంద్రబాబు చేపలు కూరవండారు. అంతేకాకుండా లంచ్లో భోజనం వడ్డించి వారి కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ వీడయోలు చూడండి:

దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్

కల్తీ మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ జోగి!!

Updated at - May 20 , 2026 | 09:08 AM