బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల నిర్వాకం.. ఫామ్‌హౌస్‌లో చిందులు

ABN, Publish Date - Nov 17 , 2026 | 01:07 PM

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులు ఫామ్‌హౌస్‌లో చిందులు వేశారు. పోలీస్‌స్టేషన్ రికార్డుల్లో ఆన్‌ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసి ఫామ్‌హౌస్‌లోని బర్త్‌డే పార్టీకి వెళ్లారు.

మంచిర్యాల జిల్లా, నవంబర్ 17: జిల్లాలోని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులు ఫామ్‌హౌస్‌లో చిందులు వేయడం సంచలనంగా మారింది. పోలీస్‌స్టేషన్ రికార్డుల్లో ఆన్‌ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసి ఫామ్‌హౌస్‌లోని బర్త్‌డే పార్టీకి వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో చిందులు వేశారు. ఇద్దరు ఏఐఎస్‌లు, ఒక ఎస్‌ఐ మినహా ఇతర సిబ్బంది మొత్తం పుట్టినరోజు వేడుకల్లో చిందులు వేసినట్లు తెలుస్తోంది. బర్త్‌డే పార్టీలో పోలీసులు డ్యాన్స్‌లు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated at - Nov 17 , 2026 | 01:24 PM