బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ హెచ్చరిక

ABN, Publish Date - Nov 10 , 2026 | 10:48 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమవాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని పలు వాతావరణ మోడల్స్ అంచనా వేస్తున్నాయి.

అమరావతి, నవంబర్ 10: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని పలు వాతావరణ మోడల్స్ అంచనా వేస్తున్నాయి. ఈనెల 18 లేదా 19వ తేదీ కల్లా ఉత్తర తమిళనాడు తీరానికి చేరువగా వస్తుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని మరికొన్ని మోడల్స్ అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated at - Nov 10 , 2026 | 10:58 AM