వైసీపీ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన

ABN, Publish Date - Mar 04 , 2026 | 04:00 PM

శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తాను ఒక మంత్రిగా కాకుండా, శ్రీవారి భక్తునిగా మాట్లాడుతున్నట్లు తెలిపారు.

అమరావతి, మార్చి 4: కల్తీ నెయ్యి అంశంపై శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డూ విషయంలో వైసీపీ సభ్యుల తీరు బాధ కలిగిస్తోందన్నారు. సభలో తాను మంత్రిగా కాకుండా... ఒక సామాన్య శ్రీవారి భక్తునిగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇతర మతాలను గౌరవించాలన్నారు మంత్రి. ‘నేను హిందువుని.. జగన్, చైర్మన్ మోషేన్ రాజు క్రిస్టియన్లు.. తప్పులేదు ఎవరు ఏ మతం అయినా అనుసరించవచ్చు’ అని మంత్రి అన్నారు.


తనను క్రిస్టియన్ అనడంపై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం తెలిపారు. తాను హిందువునని మోషేన్ రాజు ప్రకటించారు. చైర్మన్ ప్రకటనతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అయినప్పటికీ వైసీపీ సభ్యులో సభలో వాగ్వాదానికి దిగారు. ‘నేను మంత్రి వ్యాఖ్యలకు సంతృప్తి చెందాను.. ఇంకా మీకు అభ్యంతరం ఏంటి’ అని వైసీపీ సభ్యులను చైర్మన్ మోషేన్ రాజు ప్రశ్నించారు.

Updated at - Mar 04 , 2026 | 04:07 PM