గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు
ABN, Publish Date - Feb 12 , 2026 | 01:14 PM
వైసీపీ నేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు కోర్టుకు తరలించారు పోలీసులు. కోర్టుకు తరలించే క్రమంలో ఆయన ప్రజలకు అభివాదం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు తరలించారు పోలీసులు. గతంలో సంక్రాంతి లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలపై జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో.. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు ఆయనపై పీటీ వారెంట్ వేశారు. దీంతో రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల వాహనంలో ఉన్న రాంబాబు.. సినిమా స్టైల్లో ప్రజలకు అభివాదం చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇవీ చదవండి:
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Updated at - Feb 12 , 2026 | 01:32 PM