కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం.. ఎందుకంటే..

ABN, Publish Date - Apr 17 , 2026 | 07:24 AM

కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు సమావేశం కానున్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ, ఓటింగ్‌ను సీకే కన్వెన్షన్ సెంటర్‌లో బిగ్ స్క్రీన్‌పై వారు చూడనున్నారు.

అమరావతి: కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా ప్రతినిధులు నేడు(శుక్రవారం) సమావేశం కానున్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ, ఓటింగ్‌ను మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో బిగ్ స్క్రీన్‌పై వారు చూడనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. ఆ బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ప్రసంగించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

జనగామ జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం కుమారుల హత్యకు

వైఎస్ జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్

Updated at - Apr 17 , 2026 | 07:36 AM