డిప్యూటీ సీఎం దుర్మరణం.. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి
ABN, Publish Date - Jan 28 , 2026 | 11:13 AM
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తోన్న విమానం బారామతిలో ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలిపోయింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తోపాటు విమానంలో ఉన్న నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 28: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ ఇవాళ పూణే జిల్లాలో చార్టర్డ్ విమానం కూలిపడటంతో మృతి చెందారు. ఈ దుర్ఘటనలో విమానంలో డిప్యూటీ సీఎంతోపాటు ఉన్న మరో ఆరుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుండి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉదయం 8.45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Updated at - Jan 28 , 2026 | 11:28 AM