ఏఐని వాడకపోతే ఇంటికి పంపిస్తాం.!
ABN, Publish Date - Feb 21 , 2026 | 07:05 AM
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి సమూల మార్పులకు లోనవుతోంది. ఇప్పుడు కేవలం నైపుణ్యం మాత్రమే సరిపోదు, ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడం ఒక తప్పనిసరి అర్హతగా మారుతోంది.
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి సమూల మార్పులకు లోనవుతోంది. ఇప్పుడు కేవలం నైపుణ్యం మాత్రమే సరిపోదు, ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడం ఒక తప్పనిసరి అర్హతగా మారుతోంది. తాజాగా దిగ్గజ టెక్ సంస్థ యాక్సెంచర్ తీసుకున్న నిర్ణయం దీనికి నిదర్శనం. సంస్థలోని సీనియర్ మేనేజర్లు.. అసోసియేట్ డైరెక్టర్లు కచ్చితంగా అందిపుచ్చుకోవాలని, లేని పక్షంలో ప్రమోషన్లు ఆశించవద్దని కంపెనీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటే ఏఐ ఇప్పుడు కీలక ప్రామాణికంగా మారింది.
ఇవి కూడా చదవండి
10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్
పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ
Updated at - Feb 21 , 2026 | 07:10 AM