17వ వార్షికోత్సవంలో ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి ఆదిత్య..

ABN, Publish Date - Oct 15 , 2026 | 06:15 PM

ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 17వ వార్షికోత్సవం జరిగింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి అనూష, డైరెక్టర్ శ్రుతి కీర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జర్నలిజమే శ్వాసగా.. వీక్షకులే దేవుళ్లుగా నిరంతర ప్రస్థానాన్ని కొనసాగించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి 17 వసంతాలు పూర్తి చేసుకుంది. అలుపెరుగని పాత్రికేయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఏబీఎన్.. ప్రజల గొంతుకై నిరంతరం పని చేస్తోంది. ఈ 17 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను సాధించింది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో వార్షికోత్సవాలు జరిగాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి అనూష, డైరెక్టర్ శ్రుతి కీర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 15 , 2026 | 06:34 PM