బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సినీ, రాజకీయరంగ ప్రముఖులు
ABN, Publish Date - May 03 , 2026 | 11:31 AM
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె నిశ్చితార్థ వేడుక మే 3, 2026న అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్, మే 3: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి అంబరాన్ని తాకింది. ఆయన కుమార్తె నిశ్చితార్థ వేడుక ఇవాళ (మే 3, 2026) అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆయనతో పాటు కేశినేని చిన్ని, సినీ దర్శకులు రాఘవేంద్రరావు తదితరులు విచ్చేసి బండ్ల గణేష్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తన కుమార్తె వేడుకలో బండ్ల గణేష్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. వచ్చిన అతిథులను స్వయంగా ఆహ్వానిస్తూ వేడుక అంతటా చురుగ్గా పాల్గొన్నారు. బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగింది.
Updated at - May 03 , 2026 | 11:41 AM