Share News

ఒలింపిక్స్‌ లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ధి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:58 AM

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

ఒలింపిక్స్‌ లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ధి

  • మంత్రి వాకిటి శ్రీహరి

శంభునిపేట, వరంగల్‌ స్పోర్ట్స్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో వరంగల్‌ రంగశాయిపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్‌ -17 బాలికల హాకీ ఛాంపియన్‌ షిప్‌ క్రీడా పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.


క్రీడాకారుడిగా రాణించిన తను.. విధి వక్రీకరించటం వల్ల అవకాశాలు కోల్పోయానని అయినా అందుకు బాధపడడం లేదన్నారు. క్రీడాశాఖ మంత్రిగా బుల్లెట్‌ లాంటి క్రీడాకారుల్ని తీర్చిదిద్దే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఓరుగల్లు క్రీడాకారులకు పుట్టినిల్లు వంటిదని, పారా ఒలింపిక్స్‌ విజేత దీప్తి జీవాంజీని ఆదర్శంగా తీసుకొని పతకాలు సాధించాలని సూచించారు. అనంతరం హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో అభివృద్ధి పనులను మంత్రి శ్రీహరి పరిశీలించారు. డిసెంబరు 18 నుంచి 21 వరకు కొనసాగనున్న 8వ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో భాగంగా ఈ స్టేడియంలో అథ్లెటిక్స్‌ విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 05:58 AM