పెద్ది సుదర్శన్‌రెడ్డికి కొనసాగుతున్న చికిత్స
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:22 AM
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు తెలిసింది. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న ఆయనకు చికిత్స కొనసాగుతోంది. గుండె ఆగిపోయిన సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో
ఇంకా విషమంగానే ఆరోగ్య పరిస్థితి!
హనుమకొండ (ఆంధ్రజ్యోతి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు తెలిసింది. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న ఆయనకు చికిత్స కొనసాగుతోంది. గుండె ఆగిపోయిన సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, 72 గంటల తర్వాత ఇప్పటికీ పెద్ది శరీరం నుంచి ఎలాంటి స్పందన లేదని వైద్యులు చెప్పినట్టు తెలిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వీడియోకాల్ ద్వారా అమెరికా వైద్యుల సహాయంతో చికిత్స అందించినట్టు సమాచారం. కాగా, బీఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు బుధవారం సాయంత్రం 6 గంటలకు యశోద ఆస్పత్రికి వెళ్లారు. పెద్ది ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోతు కవిత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు కూడా యశోద ఆస్పత్రికి తరలివెళ్లారు.