కేటీఆర్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్
ABN , Publish Date - May 06 , 2026 | 03:43 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే..
హనుమకొండ, మే 06: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలు 'దయ్యాలు వేదాలు వల్లించినట్లు' ఉన్నాయని ఎద్దేవా చేశారు. శనివారం జరిగిన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సుపై నాయిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక నకిలీ విత్తనాలు అమ్మే ముఠా అని, వారి హయాంలో 7 వేల మంది రైతులు మరణించారని ఆయన గుర్తుచేశారు. రైతులపై ఎఫ్ఐఆర్ చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, రైతులను నట్టేట ముంచిన చరిత్ర వారిదని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ మాట్లాడుతూ‘ స్క్రిప్ట్ రాసిస్తే చదవడం కాదు, దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలి. రాహూల్ గాంధీని విమర్శించే స్థాయా నీది?. ఒకప్పుడు మీ కుటుంబం సోనియా గాంధీ చుట్టూ తిరిగారు. కేటీఆర్ వెంట ఉన్న వాళ్లంతా దోపిడీదారులే.. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి హనుమకొండ చౌరస్తాకు వస్తావా? రైతులను నట్టేట ముంచింది బీఆర్ఎస్. నా ప్రశ్నలకు కాదు, ముందు నీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు