Share News

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలి: కేసీఆర్

ABN , Publish Date - Sep 13 , 2026 | 08:44 PM

వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలి: కేసీఆర్
KCR Ganesh Chaturthi Wishes

హైదరాబాద్, సెప్టెంబర్ 13: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే దైవంగా హిందూ సమాజం వినాయకుడిని కొలుస్తుందని పేర్కొన్నారు. దైవ పూజలు, ధార్మిక క్రతువులను విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించడం ద్వారా హిందూ సంప్రదాయాల్లో గణనాయకుడికి తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని అన్నారు.


తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. వ్యవసాయం తిరిగి గాడిలో పడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుతూ ఏకదంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, విజయాలు నిండాలని వినాయకుడిని కోరుకుంటూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ

విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 09:26 PM