భార్యాభర్తల గొడవలు.. కదులుతున్న కారులోంచి దూకి మహిళ మృతి
ABN , Publish Date - May 03 , 2026 | 09:31 PM
వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ శివారులోని జాతీయ రహదారిపై దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న కారులోంచి దూకి మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్, మే 03: వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ శివారులోని జాతీయ రహదారిపై దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపుల నేపథ్యంలో, కదులుతున్న కారులో నుంచి దూకి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మద్దూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన సోన (27) అనే మహిళ, తన భర్త రాజుతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తోంది. రాజు హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి 2021లో వివాహం కాగా, ఇద్దరు సంతానం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోనకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త రాజు ఆమెను నిత్యం వేధించేవాడు. ఇదే విషయమై ఈరోజు కూడా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ తమ స్వగ్రామానికి కారులో బయలుదేరారు. పరిగి మండలం గడిసింగాపూర్ శివారులోకి రాగానే దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన సోన, కదులుతున్న కారులోంచి కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సోన భర్త రాజును, వారు ప్రయాణిస్తున్న కారును అదుపులోకి తీసుకున్నాం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన పీవీ సింధు
పాలకొల్లులో మంత్రి నిమ్మల సుడిగాలి పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన