వికారాబాద్లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
ABN , Publish Date - Nov 22 , 2026 | 10:23 AM
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుగ్గ రామేశ్వరం మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
వికారాబాద్, నవంబరు 22: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బుగ్గ రామేశ్వరం మలుపు వద్ద ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పెండ్లిమడుగు నుంచి కేరెల్లి వైపు వెళ్తున్న ఆటోను బుగ్గ రామేశ్వరం మలుపు వద్ద లారీ ఢీకొట్టినట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లారీ ఢీకొట్టిన ధాటికి ఆటోలో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారన్న వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆటో ఏ మార్గంలో వెళ్తోంది? లారీ ఏ దిశ నుంచి వచ్చింది? ప్రమాదానికి అసలు కారణమేంటనే కోణంలో వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో బుగ్గ రామేశ్వరం మలుపు వద్ద విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు!
22 నుంచి ఎస్ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్ టికెట్లు
Read Latest AP News And Telangana News