కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్లే దేశంలో ఇంధన సంక్షోభం : వీహెచ్
ABN , Publish Date - May 25 , 2026 | 06:19 PM
ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్, మే 25: ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని.. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్ కొరత, విపరీతమైన ధరల పెరుగుదల, అంతర్జాతీయ పరిణామాలు, దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ సలహాదారు వీ.హెచ్ మాట్లాడుతూ.. ‘దేశంలో సామాన్యుడు ఎక్కడికి వెళ్లినా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం. మోదీ నిర్ణయాల వల్ల ఆయన స్నేహితులు అంబానీ, అదానీ లాభపడుతున్నారు. ప్రధాని మోదీ నిరంతరం జపించే 'సబ్ కా సాత్-సబ్ కా వికాస్' అనేది కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోయింది. ఆచరణలో మాత్రం అది 'అందరినీ ఇబ్బంది పెట్టే' విధానంగా మారింది. యుద్ధాన్ని ఆపేందుకు మోదీ ఎందుకు ప్రయత్నం చేయలేదు? మోదీకి ట్రంప్ ఫ్రెండ్ అని అంటారు కదా ట్రంప్‌కి చెప్పి యుద్ధాన్ని ఆపవచ్చు కదా. దేశ ఆర్థిక పరిస్థితి కుంగి పోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలిసిన అమిత్ షాకి ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదా?’’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..
Read Latest AP News And Telugu News