Share News

మహబూబాబాద్‌లో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకుల మృతి..

ABN , Publish Date - May 20 , 2026 | 10:20 AM

మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొర్రూర్ సమీపంలోని వెలికట్ట వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్‌లో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకుల మృతి..
Mahabubabad Accident

తొర్రూర్, మే 20: మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొర్రూర్ సమీపంలోని వెలికట్ట వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై అర్ధరాత్రి వేళ ప్రయాణిస్తున్నారు. తొర్రూర్ సమీపంలోని వెలికట్ట వద్దకు చేరుకోగానే, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వీరి బైక్ వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు.


సమాచారం అందుకున్న వెంటనే తొర్రూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారు అల్లి సంపత్ (25), లింగమల్ల సతీష్ (28), పొట్టకర్ల వంశీ (22) గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన యువకులు కావడంతో బొడ్లాడ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏఐతో ఉద్యోగ సంక్షోభం: ఆంత్రోపిక్‌ సీఈవో

మోదీ.. నా ప్రశ్నకు బదులేదీ? కలకలం రేపుతున్న నార్వే జర్నలిస్టు ఉదంతం

Updated Date - May 20 , 2026 | 10:44 AM