Share News

ఏఐతో ఉద్యోగ సంక్షోభం: ఆంత్రోపిక్‌ సీఈవో

ABN , Publish Date - May 20 , 2026 | 02:50 AM

కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా తీవ్ర ఉద్యోగ సంక్షోభం రానుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌కు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న డారియో ...

ఏఐతో ఉద్యోగ సంక్షోభం: ఆంత్రోపిక్‌ సీఈవో

వాషింగ్టన్‌, మే 19: కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా తీవ్ర ఉద్యోగ సంక్షోభం రానుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌కు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న డారియో అమొడెయ్‌ హెచ్చరించారు. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీని ప్రభావం తొలుత ప్రవేశ స్థాయి (ఎంట్రీ లెవల్‌) ఉద్యోగాలపై ఉంటుందని చెప్పారు. రెండేళ్ల క్రితం ఏఐ హైస్కూలు విద్యార్థి స్థాయిలో ఉండగా, ఇప్పుడు కాలేజీ విద్యార్థి స్థాయికి ఎదిగిందని చమత్కరించారు. ఉద్యోగాల కల్పన దృష్ట్యా ఏఐ వినియోగాన్ని తగ్గించవచ్చు కదా అన్న సూచనలు వస్తున్నాయని, కానీ చైనాతో ఉన్న తీవ్రమైన పోటీ కారణంగా అది సాధ్యం కాదని అన్నారు.

Updated Date - May 20 , 2026 | 02:50 AM