తెలంగాణ యువతకు ఇజ్రాయెల్‌లో ఉపాధి అవకాశాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
ABN , Publish Date - May 06 , 2026 | 08:30 PM
తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్: తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ ప్రతినిధులతో మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్‌లో ఉన్న టామ్‌కామ్ (TOMCOM) కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇజ్రాయెల్‌లోని నిర్మాణ రంగంలో ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘ఉద్యోగాల కల్పనకు ఎన్‌ఎస్‌డీసీఐ, పీఐబీఏ భాగస్వామ్యంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, బ్లాక్ మేసన్, డ్రై వాల్ వంటి విభాగాల్లో అభ్యర్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి 1,200 మంది కార్మికుల డిమాండ్ ఉండటంతో, అందుకు తగినట్లుగా కార్మికులను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 2025 నవంబర్‌లో ప్రీ-స్కిల్ టెస్ట్‌ను నిర్వహించగా, ఇందులో 4,247 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వారిలో 2,059 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 1,200 మందికి మే 5 నుంచి 10వ తేదీ వరకు తుది స్కిల్ పరీక్షలను నిర్వహించి అభ్యర్థులను సిద్ధం చేస్తారు’ అని అన్నారు. ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, టామ్‌కామ్ డైరెక్టర్ కాంతి వెస్లీ, టామ్‌కామ్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్
మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News