డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మీ సేవ కేంద్రాలు.. తెలంగాణ ప్రభుత్వ వినూత్న కార్యక్రమం
ABN , Publish Date - Jul 24 , 2026 | 08:37 PM
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ రంగంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెటా సహకారంతో మీ సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా అభివృద్ధి చేసి, చిన్న వ్యాపారాలకు తక్కువ ఖర్చుతో ప్రకటనల సేవలు అందించనుంది.
హైదరాబాద్, జులై 24: తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెటా (Meta) సహకారంతో మీ సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో చిన్న వ్యాపారులు సులభంగా ప్రకటనలు ఇవ్వగలిగేలా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభ దశలో 150 మంది మీ సేవ వీఎల్‌ఈలకు (Village Level Entrepreneurs) ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
ఈ శిక్షణలో వాట్సాప్ బిజినెస్ వినియోగం, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రకటనల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీంతో గ్రామీణ ప్రాంతాల చిన్న వ్యాపారాలు కూడా ప్రొఫెషనల్ డిజిటల్ ప్రచారాన్ని తక్కువ ఖర్చుతో పొందే అవకాశం కలుగుతుంది. అదే సమయంలో మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడటంతో పాటు, రాష్ట్రంలో డిజిటల్ వ్యాపార అభివృద్ధికి ఈ కార్యక్రమం కీలకంగా మారనుంది.
ఈ వార్తలనూ చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్స్.. ప్రభుత్వ వర్గాల కీలక వ్యాఖ్యలు
కోర్టు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు