Share News

భూ రీసర్వే, ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 08:07 PM

భూ రీసర్వే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ రీసర్వేను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 భూ రీసర్వే, ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Telangana Land Resurvey

హైదరాబాద్, నవంబర్ 11: భూ రీసర్వే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే భూ రీసర్వే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ రీసర్వే ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

సర్వే అనంతరం అభ్యంతరాల స్వీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని, నోటీసుల జారీ తర్వాత ప్రతి 15 రోజులకు గ్రామాల్లో చాటింపు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం 708 రోవర్లతో కొనసాగుతున్న రీసర్వేకు వారం రోజుల్లో అదనంగా 400 రోవర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని 141 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపడుతున్నట్లు, ఎస్‌ఓపీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ–ఫారెస్ట్ భూముల సరిహద్దుల నిర్ధారణ, 22ఎ భూముల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి.. పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లను ఆదేశించారు. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, హనుమకొండ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి వెంటనే భూములను గుర్తించాలని సూచించారు. 2బీహెచ్‌కే ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. భూ రీసర్వే పనితీరులో నల్గొండ, ఖమ్మం జిల్లాలపై ప్రశంసలు వ్యక్తం చేయగా, నిజామాబాద్ జిల్లాలో రీసర్వే పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 11 , 2026 | 08:53 PM