ఇరిగేషన్ డీఈఈ ఆస్తులు రూ.70 కోట్ల పైనే!
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:50 AM
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో నాగర్‌కర్నూల్ జిల్లా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ (ఐసీఏడీ) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) రాగిరి సత్యనారాయణ గౌడ్ ఇళ్లు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.
పది వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల సోదాలు
ఒక విల్లా, రెండు ఫ్లాట్లు, 5 ఓపెన్ ప్లాట్లు, 4 కార్లు,
అరకిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపు
బీఆర్‌ఎస్ హయాంలో ఎత్తిపోతల పథకాల్లో కీలక పాత్ర
ఫిర్యాదుల నేపథ్యంలో రెండు నెలలుగా ఆయనపై నిఘా
పది వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల సోదాలు
బీఆర్‌ఎస్ హయాంలో ఎత్తిపోతల పథకాల్లో కీలక పాత్ర
ఫిర్యాదుల నేపథ్యంలో రెండు నెలలుగా ఆయనపై నిఘా
హైదరాబాద్/ ఎల్‌బీనగర్/నాగర్‌కర్నూల్/ఖిల్లాగణపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో నాగర్‌కర్నూల్ జిల్లా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ (ఐసీఏడీ) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) రాగిరి సత్యనారాయణ గౌడ్ ఇళ్లు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. డీఈఈ సత్యనారాయణగౌడ్‌కు ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు 1064కు ఫిర్యాదులు రావడంతో రెండు నెలలుగా ఆయనపై ఏసీబీ నిఘా పెట్టింది. గురువారం ఉదయం సెర్చ్ వారెంట్లతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని సత్యనారాయణ నివాసంతోపాటు నాగర్‌కర్నూల్‌లోని కార్యాలయం, నాగర్‌కర్నూల్ జిల్లా షాపూర్‌లోని స్వగృహం, ఆయన సోదరుడు శ్రీశైలంగౌడ్ ఇల్లు, ఫామ్‌హౌ్‌సలు.. ఇలా మొత్తం పది చోట్ల సోదాలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. సత్యనారాయణగౌడ్ తండ్రి మన్యంగౌడ్ ఆస్తుల వివరాలపైనా ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ చలపతి మాట్లాడుతూ సత్యనారాయణ నివాసంలో 50 తులాల బంగారు ఆభరణాలు, 4 కార్లు, ఒక ట్రాక్టర్‌ను గుర్తించామని తెలిపారు.
అలాగే, తుక్కుగూడలో ఖరీదైన విల్లా, వనపర్తిలో 25 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 2 ఫ్లాట్లు, 5 ఓపెన్ ప్లాట్లు, ఎల్‌ఐసీ బాండ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ సుమారు రూ.7కోట్ల దాకా ఉంటుందని, బహిరంగ మార్కెట్లో రూ.70కోట్ల దాకా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. సోదాలు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాగిడి సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. 2005లో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన సత్యనారాయణ వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇరిగేషన్, క్యాడ్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనుల్లో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
ఇవి కూడా చదవండి..
మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు