Share News

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త అధికారులు

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:29 AM

తెలంగాణ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జయేష్ రంజన్‌కు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు, వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ బాధ్యతలు కేటాయించింది. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యం, రెవెన్యూ సహా పలు కీలక శాఖల్లో మార్పులు చేసింది.

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త అధికారులు
Telangana IAS Transfers

హైదరాబాద్‌, అక్టోబర్ 28: తెలంగాణ ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. జయేష్ రంజన్‌కు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ (EFST) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించగా.. వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. నవీన్ మిట్టల్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా (RWS) శాఖల బాధ్యతలు అప్పగించింది. శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ, ఏ.వాణి ప్రసాద్‌కు క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ బాధ్యతలు కేటాయించింది. రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించగా, కె. ఇలంబర్తి‌ను రవాణా శాఖ కార్యదర్శిగా నియమించింది.


ఇతర మార్పుల్లో భాగంగా సర్ఫరాజ్ అహ్మద్‌కు జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. శృతి ఓజాకు మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల బాధ్యతలు కేటాయించారు. ముషర్రఫ్ అలీ ఫారూఖీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించగా, డాక్టర్ సంగీత సత్యనారాయణను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. జితేష్ వి. పాటిల్‌కు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఆర్‌ఈడీసీఓ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి.


ఇవి కూడా చదవండి...

వర్షం తగ్గినా తుఫాన్ ముప్పు తగ్గలేదు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ లక్ష్మీశా

ఆర్నబ్ తుఫాన్‌తో రైతులకు తీవ్ర నష్టం.. బాధితులను ఆదుకుంటాం: సానా సతీష్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 11:50 AM