రూ. 200 కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తారా?
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:04 AM
ఒక కేసులో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు కోసం ఇరువర్గాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లడాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి తప్పుబట్టారు.
హైకోర్టు ఆగ్రహం..
పిటిషన్‌ను ఉపసంహరించుకున్న పిటిషనర్
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఒక కేసులో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు కోసం ఇరువర్గాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లడాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి తప్పుబట్టారు. ఇది ఎంతవరకు సమంజసమని కక్షిదారులను ప్రశ్నించారు. ఇరుపక్షాలతో న్యాయమూర్తి మాట్లాడటంతో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ అంగీకరించారు. అపోలో ఆస్పత్రిలో ఔట్ పేషెంట్‌గా వైద్యం చేయించుకునేందు కు వెళ్లిన రోగి నుంచి రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీలోని విశాఖపట్నంకు చెందిన శంకర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నుంచి రూ.200 వసూలు చేయడం అక్రమం అన్నారు. ఈ సందర్భంగా రూ.200 ఫీజు కోసం ఈ న్యాయపోరాటం చేయడం అవసరమా? అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ చిన్న మొత్తానికి రాష్ట్ర వినియోగదారుల కమిషన్, జాతీయ వినియోగదారుల కమిషన్, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ హైకోర్టులో వాదనలు వినిపించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్పత్రి కూడా రూ.200 తిరిగి చెల్లిస్తే సరిపోయేది కదా? అని ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రశ్నించాలంటే పిల్ వేసుకోవాలని సూచించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ చెప్పడంతో అంగీకరిస్తూ విచారణను ముగించింది.
ఇవి కూడా చదవండి..
మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు