న్యాయవాదులపై దాడి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:09 AM
అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాదులు వీడియోలు తీస్తుండగా పోలీసులు దాడికి ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో ఘటన జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని హైకోర్టు రాజేంద్రనగర్ డీసీపీకి ఆదేశాలు జారీచేసింది.
అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాదులపై దాడి..
పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాదులు వీడియోలు తీస్తుండగా పోలీసులు దాడికి ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో ఘటన జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని హైకోర్టు రాజేంద్రనగర్ డీసీపీకి ఆదేశాలు జారీచేసింది. 22న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని ధ్రువీకరణ పత్రంతో సహా పెన్‌డ్రైవ్‌లో అందజేయాలని సూచించింది. ఈ ఉత్తర్వులను ప్రతివాదులైన పోలీస్ అధికారులకు తెలియజేసి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హోంశాఖ తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
వృత్తిపరమైన పని కోసం ఇద్దరు న్యాయవాదులు అత్తాపూర్ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లగా.. ఆ సమయంలో పోలీసులు ఇతర కేసుల్లోని నిందితులను విచారిస్తున్నారు. ఆ దృశ్యాలను న్యాయవాదులు చిత్రీకరించేందుకు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తమపై దాడిచేశారని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ సదరు న్యాయవాదులు హైకోర్టులో బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. హోంశాఖ తరఫు న్యాయవాది వాదిస్తూ.. జరిగిన ఘటనపై పోలీసులు క్షమాపణలు తెలియజేశారని గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని రాజేంద్రనగర్ డీసీపీకి ఆదేశాలు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
నేడు, రేపు భారీ వర్షాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News