Share News

గుడ్ న్యూస్.. గ్రామపంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:46 PM

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది. వివరాల్లోకి వెళితే..

గుడ్ న్యూస్.. గ్రామపంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
Telangana Gram Panchayat Promotions

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది.


జిల్లా స్థాయిలో రొటేషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ సాగనుంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 12 నుంచి అమలులోకి రానున్నాయి. దీనివల్ల వేలమంది అధికారులకు లబ్ధి చేకూరడమే కాకుండా, గ్రామాల్లో పాలన మరింత పటిష్టం కానుంది. అధికారులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ

అక్కడే తేల్చుకోండి.. ఆకివీడు రామాలయం పిల్‌పై ఏపీ హైకోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2026 | 06:57 PM