హైదరాబాద్ మెట్రోని స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం
ABN , Publish Date - Apr 29 , 2026 | 09:09 PM
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియలో కీలక ముందడుగు వేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియలో ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, లార్సెన్ అండ్ టుబ్రో (L&T), ఎల్&టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు 100 శాతం వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
2017 నవంబర్ నుంచి 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. ఫేజ్-1 ప్రభుత్వ ఆధీనంలోకి రావడం వల్ల ప్రతిపాదిత ఫేజ్-2తో సమన్వయం మరింత మెరుగవుతుందని, ప్రణాళికలు, సేవల అమలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News